మళ్ళీ జనతా గ్యారేజ్ కు ఏర్పాట్లు…!

Megastar Movie With Korata Siva Archives

ప్రిన్స్ మహేష్ బాబుకి భరత్ అనే నేను లాంటి సూపర్ డూపర్ హిట్ట్ చిత్రాని అందించిన కొరటాల శివ ఆ తరువాత సినిమాను మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా రుపొందిన్చనున్నాడు. ఈ చిత్రం జనవరిలో పూజ కార్యక్రమాలతో సెట్స్ పైకి వెళ్ళుతుంది. చిరంజీవి ఈ చిత్రంలో రైతుగా నటిస్తాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దానికి సంబందించిన కథను ఎన్టీఆర్ కోసం సిద్దం చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో ఇంతకు ముందు జనత గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ట్ చిత్రాని అందించాడు. ఆ సమయంలో కొరటాల శివకు ఎన్టీఆర్ కు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.

ఆ చనువుతో ఎన్టీఆర్ తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాని తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తాడు. భవిష్యత్తులో వీరిద్దరూ కూడా నిర్మాణ భాద్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం మెగా స్టార్ చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కొరటాల బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్ళాలంటే 2020వరకు అగాలిసిందే. మొత్తానికి కొరటాల శివకుడ తన సినిమా జోరును పెంచేశాడు.