‘బాహుబలి’ నుండి పూర్తిగా బయటకు..!

http://telugubullet.com/wp-content/uploads/2017/06/prbahas-saho-movie-latest-update.jpg

నాలుగు సంవత్సరాల పాటు ‘బాహుబలి’ కోసం కష్టపడ్డ ప్రభాస్‌కు రెట్టింపు ఫలితం దక్కింది. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌ బాలీవుడ్‌ రేంజ్‌ను దక్కించుకున్నాడు. ‘బాహుబలి’ నుండి ప్రభాస్‌ ఇప్పట్లో బటయ పడటం కష్టమే అని అంతా భావించారు. అయితే ప్రభాస్‌ మాత్రం వెంటనే ఆ సినిమా ప్రభావం నుండి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో ఉన్న లుక్‌కు తన తర్వాత సినిమాకు పూర్తిగా మారిపోతున్నాడు. ‘సాహో’ సినిమా కోసం దాదాపు 10 కేజీల బరువు తగ్గిన ప్రభాస్‌ గడ్డం, మీసాలు కూడా తీసేయడం జరిగింది.

‘సాహో’ సినిమాను ప్రభాస్‌కు సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకు ‘రన్‌ రాజా రన్‌’ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాలుగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి ఎట్టకేలకు సెట్స్‌పైకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ‘బాహుబలి’ విడుదలైనప్పటి నుండి దాదాపు నెల రోజులుగా అమెరికాలో ఉంటున్న ప్రభాస్‌ తాజాగా ఇండియాకు వచ్చాడు. ఈ సందర్బంగానే ఇలా నీట్‌ షేవ్‌తో కనిపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ‘సాహో’ సినిమా షూటింగ్‌ను మరో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి.

‘బాహుబలి’ నుండి పూర్తిగా బయటకు..! - Telugu Bullet