ఆ సినిమా ప్రధాని పదవిని అవమానపర్చడం కోసమే..!

http://telugubullet.com/wp-content/uploads/2017/06/The-Accidental-Prime-Minist.jpg

ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తుంది. మోడీ ప్రధాని కాకముందు పది సంవత్సరాల పాటు యూపీఏ అభ్యర్థిగా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంను మన్మోహన్‌ సింగ్‌ నడిపించడం జరిగింది. రబ్బరు స్టాంప్‌ అంటూ మన్మోహన్‌ సింగ్‌కు పేరు వచ్చింది. ప్రధాని పదవి నుండి మన్మోహన్‌ తప్పుకున్న తర్వాత కూడా ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దేశ అత్యున్నత పదవిని చేపట్టిన వ్యక్తి ఎలా వ్యవహరించినా కూడా ఆయన్ను విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లుగా భావించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ఎలా ప్రధాని అయ్యాడు అనే విషయాన్ని తీసుకుని సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో సలహాదారుగా పని చేసిన సంజయ్‌ బారు రచించిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’ బుక్‌ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ సినిమాలో ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్న సమయంలో సోనియా గాంధీ ఎంతగా ప్రభావితం చేసింది, ఎలా వ్యవహరించింది అనేది చూపించే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికలను టార్గెట్‌గా చేసి, కాంగ్రెస్‌పై దుమ్ము ఎత్తి పోసేలా ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల వారు భావిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పాత్రను అనుపమ్‌ ఖేర్‌ నటించబోతున్నాడు. సినిమాలో సోనియా గాంధీని కూడా కీలక పాత్రల్లో ఒక పాత్రగా చూపించే అవకాశాలున్నాయి. సినిమా వివాదాస్పదం కాకుండా విమర్శలు ఎక్కుపెడుతూ సినిమాను తెరకెక్కించాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఎంతగా వివాదం రాకుండా తెరకెక్కించిన ప్రధాని స్థాయిని అవమానించినట్లే అని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.