ప్రభాస్ ‘సాహో’ యాక్షన్ కి ఆదిలోనే దెబ్బ…

saaho movie action schedule postponed in Dubai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబలి తో అంతర్జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకున్నాడు ‘ప్రభాస్’… ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో ‘ప్రభాస్’‘సాహో’అనే మూవీలో నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత సినిమా అవ్వటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి… ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా యూవీ క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే ‘సాహో’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ ని హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో కళ్లు చెదిరే విధంగా తీయబోతున్నారని, కేవలం ఈ యాక్షన్ ఎపిసోడ్ కు మాత్రమే 40 కోట్ల దాకా ఖర్చవుతుందని సమాచారం… అందుకుగాను దుబాయిలో75 రోజుల పాటు ఆ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రీ- ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని హాలీవుడ్ టీంతో దుబాయ్ షెడ్యూల్ కి రెడీ అయ్యాడు దర్శకుడు సుజీత్.

కానీ వీళ్లు అనుకున్న దుబాయి యాక్షన్ షెడ్యూల్ మీద అక్కడి గవర్నమెంట్ నీళ్ళు చల్లింది. సాహో టీం షూటింగ్ చేయాలనుకున్న ప్రాంతాల్లో ప్రజలకి బాగా ఇబ్బంది అవుతుందని, ఈ సమయంలో మీకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అనుమతికోసం అనేక రకాలుగా ప్రయత్నించిన సాహో టీం చివరకు విఫలమయ్యారు. దీంతో ఒక టీంను ఆ పని మీద పెట్టి… దుబాయి నుంచి సాహో చిత్ర బృందం హైదరాబాద్ కు చేరుకుంటుంది. జనవరి రెండో వారం నుంచి హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ చేసి, ఈ లోపు మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని డిసైడయ్యారు. దుబాయిలో చిత్రీకరణకు అన్ని అనుమతులూ వచ్చాక ఆ ఎపిసోడ్ షూట్ చేసుకుంటారట పాపం…