నువ్వు సంతోషంగా ఉన్నావా…? ప్ర‌కాశ్ రాజ్ ను ప్ర‌శ్నించిన మ‌ధుర శ్రీధ‌ర్

Madhura Sridhar Reddy comments prakash raj

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గుజ‌రాత్ లో 150కి పైగా సీట్లు సాధిస్తామ‌ని చెప్పిన ప్ర‌ధాని ఈ ఫ‌లితాల‌తో సంతోషంగా ఉన్నారా అని విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి స్పందించారు. అస‌లు ప్ర‌కాశ్ రాజ్ గోలేంటో అర్ధం కావ‌ట్లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న అహంకారంతో ప్ర‌కాశ్ రాజ్ ఎంతోమంది నిర్మాతలు, డైరెక్ట‌ర్ల‌ను ఇబ్బందిపెట్టాడ‌ని, మ‌రి ఆయ‌న సంతోషంగా ఉన్నాడా అని శ్రీధ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

హెడ్ లైన్ల‌లో నిల‌వ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని ప్ర‌కాశ్ రాజ్ కు స‌ల‌హా ఇచ్చారు. ముందు ఒక నాయకుడిగా ఎదగిన‌త‌ర్వాత ఎదుటివారిపై కామెంట్ చేయాల‌ని, అప్పుడు త‌న వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌కాశ్ రాజ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇటీవ‌లి కాలంలో ప్రకాశ్ రాజ్ త‌ర‌చుగా రాజ‌కీయాల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌ధానిమోడీ, బీజేపీని ఉద్దేశించి జ‌స్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.