దుబాయ్ లో సాహో టీం.

Prabhas Saaho movie shooting in Dubai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న “సాహో “ కూడా భారీ స్థాయిలోనే చేస్తున్నారు. బాహుబలి తో ప్రభాస్ కి వచ్చిన మార్కెట్ స్థిరపడేలా చేసేందుకు ఆయనకు సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్స్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ ని దుబాయ్, అబుదాబి లో భారీ ఎత్తున షూట్ చేయబోతున్నారు. జనవరి 18, 2018 నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ కి సంబంధించిన లొకేషన్స్ ఎంపిక చేయడానికి సాహో టీం ఇప్పటికే దుబాయ్ ని జల్లెడ పడుతోంది. దర్శకుడు సుజిత్ రన్ రాజా రన్ హిట్ తర్వాత రెండేళ్ల పాటు సాహో స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు. దానికి తగ్గట్టు ఏ కొంచెం కూడా రాజీ పడకుండా సాహో ని నెక్స్ట్ లెవెల్ సినిమాగా రూపొందించడానికి యువీ క్రియేషన్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.