మోడీ కి ఓటమి భయం పుట్టుకొచ్చిందా ?

Mani Shankar AiyarGave ‘Supari’ In Pakistan To Get Me ‘Removed’, Alleges PM Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనాన్ని ఉర్రూతలు వూగించేలా మాట్లాడడంలో ప్రధాని మోడీ సిద్ధహస్తుడు. 2014 ఎన్నికల ముందు ఆ ప్రసంగాల్లో వాడివేడి చూసి ఓటర్లు బాగా ప్రభావితం అయ్యారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి సామాన్య భారతీయుల అకౌంట్స్ లో వేస్తానని మోడీ చెప్పిన మాటలు జనం నమ్మారు. ఆయన మాటల్లో కనిపించిన విశ్వాసం చూసాక ఇది సాధ్యమా అని ఆలోచించిన వాళ్ళు తక్కువ. ఆ రేంజ్ లో మోడీ మాటల ప్రభావం కనిపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తానని మోడీ చెప్పిన మాటల్లో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం కనిపించింది.

narendra-modi

2014 ఎన్నికల్లో మోడీకి తన మాటలు మంత్రాల్లా పని చేశాయని అర్ధం అయ్యింది. అందుకేనేమో తాను ప్రధాని అయ్యాక మాత్రం ఆ మాటలను ఆచితూచి వాడడం మొదలెట్టారు. విదేశాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప మిగిలిన చోట్ల మాట్లాడ్డం బాగా తగ్గించారు. మోడీ ఇలా హఠాత్తుగా మౌనముని అవతారం ఎత్తాక ఆయనతో మాట్లాడించడం కాస్త కష్టమే అవుతోంది. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది.

mani-shankar-aiyar

మోడీ ఎక్కువ సభల్లో మాట్లాడడమే కాదు బేలగా మారినట్టు అనిపించింది. మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ నాయకుడు తిట్టిన తిట్లు మోడీ పట్టించుకోవడమే పెద్ద విషయం అనుకుంటే అంతకు మించి ఎక్కడికో వెళ్లారు మోడీ. తనను చంపడానికి అయ్యర్ పాకిస్తాన్ లో సుపారీ ఇచ్చారని మోడీ చేస్తున్న ఆరోపణలు ఆయన స్థాయికి తగ్గట్టు లేవు. అయ్యర్ గురించి ఇప్పుడు మోడీ మాట్లాడితే తప్ప ఆయన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ వ్యవహారం చూస్తుంటే మోడీకి నిజంగా గుజరాత్ లో ఓటమి భయం పుట్టుకొచ్చింది అనిపిస్తోంది.