చరణ్‌ మూవీ టైటిల్‌ను మార్చేశారుగా..!

Ram Charan Rangasthalam first look release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ నేడు విడుదలైంది. రామ్‌ చరణ్‌ మాంచి మాస్‌ లుక్‌లో కనిపించి మెప్పించాడు. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి ముఠామేస్త్రీతో ఆకట్టుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు అదే గెటప్‌తో రామ్‌ చరణ్‌ రాబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్రం విడుదల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఇక ఫస్ట్‌లుక్‌ను కాస్త తీక్షణంగా చూస్తే సినిమా టైటిల్‌ను మార్చినట్లుగా తేలిపోతుంది. మొదట ఈ చిత్రానికి రంగస్థలం 1985 అననే టైటిల్‌ను అనుకున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో 1985ను తీసేశారు. కేవలం ‘రంగస్థలం’ అంటూ పోస్టర్‌పై లోగో ఉంది. సినిమా టైటిల్‌లో కనీసం చిన్న సైజ్‌లో కూడా 1985 లేకపోవడంతో టైటిల్‌ నుండి సంవత్సరంను తొలగించినట్లుగా తేలిపోయింది. 1985 బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా ఇప్పటికే ప్రచారం జరిగింది. అందరికి తెలిసి పోయింది. అందుకే ఈ సినిమా టైటిల్‌లో 1985 ఇక అవసరం లేదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని సుకుమార్‌ తెరకెక్కించి ఉంటాడు అని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Ram Charan Rangasthalam first look