మల్టీస్టారర్‌పై మరింత క్లారిటీ

clarity about praveen sattaru multi starrer with three heros

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తార్‌ ఇటీవలే ‘గరుడవేగ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర్‌కు మంచి విజయాన్ని దక్కించింది. ఆ చిత్రంతో ప్రవీణ్‌ సత్తార్‌పై సినీ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. ఒక మంచి చిత్రాన్ని చేశాడు అంటూ విమర్శకుల ప్రశంసలు కూడా దర్శకుడు అందుకున్నాడు. ఇక తాజాగా ఈయన ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈయన కథకు నితిన్‌ మరియు రానాలు ఓకే చెప్పారని, త్వరలోనే నారా రోహిత్‌ ఓకే చెప్తాడు అంటూ వార్తలు వచ్చాయి. మీడియాలో జరుగుతున్న మల్టీస్టారర్‌ మూవీపై క్లారిటీ వచ్చింది.

దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ మల్టీస్టారర్‌ విషయం నిజమే అని, తాను ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. హీరోలు ఎవరు అనే విషయంపై మాత్రం ఆయన నోరు ఎత్తలేదు. త్వరలోనే తన మల్టీస్టారర్‌ చిత్రంలో నటించే ముగ్గురు హీరోలు ఎవరు అనే విషయంపై ప్రకటన చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్‌ ది రికార్డు మాత్రం రానా మరియు నితిన్‌లు మల్టీస్టారర్‌కు ఓకే చెప్పారని, త్వరలోనే సినిమాను మొదలు పెట్టనున్నట్లుగా సమాచారం అందుతుంది. నారా రోహిత్‌ ప్రస్తుతం సినిమాకు సంబంధించి అధికారిక క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.