‘లక్ష్మీ’తో ప్రభుదేవా – ట్రైలర్

Lakshmi Theatrical trailer

“మునుపెన్నడూ గెలవలేదనే భావనతో ప్రాక్టీస్ చెయ్యాలి, ఎన్నడూ ఓడిపోలేదానే భావనతో ప్రదర్శన ఇవ్వాలి” అని చెప్పే ప్రభుదేవా గారి మాటలు డాన్స్ గురించి. ఇండియాలో డాన్స్ అంటే ఎవరికయినా మొదటగా గుర్తోచ్చే పేరు ‘ప్రభుదేవా’. ఆయన ఇంతక ముందు ఎబిసిడి, ఎబిసిడి2 అనే డాన్స్ ని థీమ్ గా తీసుకొని సినిమాలను చేశారు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ ని థీమ్ గా తీసుకొని ‘లక్ష్మీ’ అనే సినిమాను తీసుకొస్తున్నారు.

 'Lakshmi' Trailer

ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్  లో హాల్ చల్ చేస్తుంది. ప్రతీ సినిమాకి కొత్త డాన్సర్స్ ని పరిచయం చేస్తూ వచ్చారు ప్రభుదేవా. ఇప్పుడు, ఈ సినిమాకి కోసం ఆయనకి దొరికిన ఆయుధం దిత్య భండే. ఈ చిన్నారి ఇంతకు ముందు డాన్స్ షోస్ ద్వారా చాలా ఫేమస్. ప్రభుదేవా గారు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ చిన్నది ఏ రేంజ్ లో డాన్స్ చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఇంకా ప్రభుదేవా గారి చేతుల్లో పడ్డాక ఇంకొంచెం సాన పెడతారని మనకి తెలిసిన విషయమే. ట్రైలర్ లో ఆ డాన్స్ చూస్తే ఎవరికైనా అర్ధమయిపోతుంది ఆ స్పీడ్. ఇక సినిమా ఎలా ఉంటుందో ఆగష్టు 24న థియేటర్ లలోనే చూడాలి.

Prabhudeva Lakshmi Movie

నటీనటులు: ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్, కరుణాకరన్, కోవై సరళ, దిత్య భాండే, సల్మాన్ యూసఫ్ ఖాన్, చామ్స్, అక్షత్ సింగ్, జీత్ దాస్, శ్యాంపాల్ మరియు తదితరులు.
రచన, దర్శకత్వం: విజయ్
సంగీతం: శ్యాం సి.ఎస్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
ఎడిటర్: ఆంథోని
నిర్మాత: సి కళ్యాణ్