“టైగర్ 3” ఓటిటి రిలీజ్ పై ప్రైమ్ వీడియో వాళ్ళు క్లారిటీ.!

“టైగర్ 3” ఓటిటి రిలీజ్ పై ప్రైమ్ వీడియో వాళ్ళు క్లారిటీ.!
Cinema News

గత ఏడాది బాలీవుడ్ సినిమా ఇచ్చిన బౌన్స్ బ్యాక్ తో మళ్ళీ బాలీవుడ్ మంచి ఫామ్ లోకి తిరిగి వచ్చింది. ఇక ఈ బౌన్స్ బ్యాక్ ని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” తో మొదలు కాగా ఈ సినిమా స్పై యూనివర్స్ లో వచ్చిన రీసెంట్ చిత్రం “టైగర్ 3” తో అయితే ఎండ్ అయ్యింది. మరి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ అవైటెడ్ సీక్వెల్ అనుకున్న అంచనాలు అందుకోలేదు కానీ ఒకింత వసూళ్లు పర్వాలేదనిపించింది.

“టైగర్ 3” ఓటిటి రిలీజ్ పై ప్రైమ్ వీడియో వాళ్ళు  క్లారిటీ.!
Tiger-3

ఇక గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కి ఈ జనవరి 7 నుంచే అమెజాన్ ప్రైమ్  వీడియోలో వచ్చేస్తుంది అని కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. అలాగే ఇప్పుడు కూడా స్ట్రీమింగ్ రేపే అంటూ టాక్ స్ప్రెడ్ అవుతుండగా దీనిపై ప్రైమ్ వీడియో వారు అప్డేట్ ఇచ్చారు.

సినిమా త్వరలో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నామని కన్ఫర్మ్ చేశారు తప్ప రేపే జనవరి 7న తీసుకొస్తున్నట్టుగా డేట్ ఇవ్వలేదు. సో టైగర్ 3 డేట్ ని వారు కన్ఫర్మ్ చేయలేదు అని చెప్పాలి. కానీ ఇలా చెప్పి చెప్పకుండా కూడా సడెన్ గా ప్రైమ్ వీడియోలో దర్శనం ఇచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా ఈ సినిమా రేపే రావచ్చని టాక్ ఉంది.