ఆదికేశవ సినిమాపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు

ఆదికేశవ సినిమాపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు
Naga Vamsi

మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లోనే ఒక సెన్సేషన్ డెబ్యూ తో ఇండస్ట్రీకి పరిచయం కాగా ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా “ఆదికేశవ” రిలీజ్ తో అయితే సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టుగా నిన్న ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. మరి ఈ మూవీ విషయంలో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ అయితే వైరల్ గా మారాయి.

ఆదికేశవ సినిమాపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు
Naga Vamsi

ఈ సినిమా కూడా ఈ ఏడాదిలో వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి లాంటి మాస్ సినిమా ల్లో ఒకటిగా నిలుస్తుంది అని ఆ సినిమా లు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మాస్ సినిమా ఇంకా రాలేదు. ఆ ప్లేస్ ని “ఆదికేశవ” భర్తీ చేస్తుంది అన్నట్టుగా తెలిపారు. అయితే రీసెంట్ గా వచ్చిన బాలయ్య భగవంత్ కేసరి కోసం కూడా మాట్లాడుతూ అందులో బాలయ్య గారు వేరే పాయింట్ టచ్ చేశారు కానీ ప్రాపర్ గా ఒక మాస్ సినిమాగా అయితే ఆదికేశవ నిలుస్తుంది అని కామెంట్స్ చేశారు. దీనితో ఈ సినిమా విషయంలో కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి