జె-బ్రాండ్ల మద్యంతో సైకో జగన్ లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు: నారా లోకేష్

Nara Lokesh shed tears over Chandrababu's arrest
Nara Lokesh shed tears over Chandrababu's arrest

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పసి పిల్లలపై కూడా జగన్ కనీసం కనికరం చూపిచడం లేదని వాపోయారు. పాలను కల్తీ చేసి కాలకూట విషంగా మార్చారంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. పసి పిల్లలకిచ్చే పాలనూ వదలవా సీఎం జగన్ అంటూ అంటూ ఫైర్ అయ్యారు. ఇంకా లోకేశ్ చేసిన ట్వీట్​లో ఏం ఉందంటే..?

‘‘రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్ఠకు చేరింది. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీచేస్తూ కాలకూట విషంగా మార్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటివరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను.. తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారు. ఈ నెల 3న ప్యాక్ చేసినట్లుగా చెబుతున్న ఈ పాల ప్యాకెట్లకు డిసెంబర్ 2 వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా.. సరఫరా చేసిన 2 రోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయి. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది’’ అని నారా లోకేశ్‌ ట్వీట్​ చేశారు.