“లవర్” రిలీజ్ డేట్… జూలై 20

Raj Tarun lover release date

నటీనటులు : రాజ్ తరుణ్, రిద్ది కుమార్
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ : ఎ.ఎస్‌.ప్ర‌కాష్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : అనీష్ కృష్ణ
తొలి చిత్రం `ఊయ్యాల జంపాల‌`తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు. అలా ఎలా సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు ఇటీవల ఈ మూవీలోని అద్భుతమే సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ను కేరళ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు.. రాజ్ తరుణ్, రిద్దీ కుమార్ లపై షూట్ చేసిన సాంగ్ స్పెషల్ గా ఉంది.. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.. ఇక ఈ మూవీ ఈ నెల 20వ తేదిన ప్రేక్ష‌కులు ముందుకు రానుంది.