ట్రైలర్‌ రివ్యూ : రాజుగాడు మహా కేటుగాడు

Rajugadu Theatrical Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజ్‌ తరుణ్‌ హీరోగా అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా సంజనా రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగాడు’ చిత్రం నాలుగు నెలల క్రితం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. డిసెంబర్‌లోనే షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమాను ఇంత కాలం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. రాజుగాడు చిత్రంతో పాటు రంగులరాట్నం అనే చిత్రాన్ని కూడా రాజ్‌ తరుణ్‌ నటించడం జరిగింది. ఆ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కింది. ఆ సినిమా సంక్రాంతికి రావడంతో రాజుగాడు సినిమా ఆలస్యం అయ్యింది. ఆలస్యం అయినా పర్వాలేదు మంచి టైంకు రావాలని నిర్మాత భావించి విడుదల వాయిదా వేశాడు. తాజాగా సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నాడు. అందులో భాగంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్‌లో రాజుగాడు ఏంటో చూపించారు. అవసరం ఉన్నా లేకున్నా కూడా రాజుగాడు తనకు తెలియకుండానే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అదో జబ్బు అని వైధ్యులు నిర్ధారిస్తారు. అలాంటి రాజుగాడు ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డ తర్వాత రాజుగాడు తన దొంగతనం చేసే జబ్బుకు దూరం అవుతాడు. రాజుగాడు ప్రేమించిన అమ్మాయి తండ్రికి చిన్న అబద్దం ఆడినా కూడా నచ్చదు. అలాంటి పరిస్థితుల్లో చిల్లరదొంగ అయిన రాజుగాడు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు, అమ్మాయి తండ్రిని ఎలా ఒప్పించి తన దారికి తెచ్చుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోండి అంటూ ట్రైలర్‌లో దర్శకురాలు ట్విస్ట్‌ పెట్టింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.