ఏపీలో ఉప ఎన్నికలు వస్తే పరిస్థితేంటి ?

what happens if By-elections happens in andhra pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నిన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సమయంలో మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జిలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చలకి తావిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలను జూన్‌ మొదటి వారంలో ఆమోదించవచ్చని, అప్పుడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఉప ఎన్నికలు వస్తే మన తడాఖా చూపిస్తామని ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఉప ఎన్నికలు కానీ చంద్రబాబు చెప్పినట్లు… ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందా..? లేదా అని పరిశీలిస్తే ఆ అవకాశం లేదనే చెప్పాలి ఎందుకంటే జూన్ రెండో తేదీ దగ్గరలో రాజీనామాలు ఆమోదిస్తే ఇంకా లోక్ సభ సమయం ఏడాది లోపే ఉంటుంది. ఒకవేళ ఉప ఎన్నిక నిర్వహించినా గెలిచే సభ్యుల పదవీకాలం కూడా ఏడాది లోపే. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏడాదిలోపు పదవీ కాలం ఉంటే ఈసీ ఎన్నికలను నిర్వహించడానికి ఇష్టపడదు.

కానీ భారత దేశంలోని ప్రభుత్వ సంస్థలు ఆయా ప్రభుత్వాల చెప్పుచేతల్లో ఉంటాయనేది అప్రకటిత రూల్. అంటే దాని ప్రకారం బీజేపీకి ఎన్నికలకి వెళ్ళడం ఇష్టం అనుకుంటే రెండో తేదీ రాజీనాలు ఆమోదిస్తే వెంటనే ఈసీ షెడ్యూల్ విడుదల చేసేయవచ్చు. ఎంత లేదన్నా దానికి ఒకటి నుండి ఆరు నెలల సమయం పడుతుంది. నిజంగానే బీజేపీ కి ఉపఎన్నికల మీద ఆసక్తి ఉంటుందా అంటే లేదు ఎందుకంటే ఏపీలో ఆ పార్టీ బలంగా లేదు తమ అభ్యర్ధులని నిలబెడితే కనీసం డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఆ ఎన్నికల్లో గనుక తమతో తెగదెంపులు చేసుకున్న టీడీపీని దెబ్బ కొట్టగలిగితే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడచ్చని బీజేపీ భావిస్తోంది అనుకోవచ్చు. వైసీపీ రాజీనామా చేసిన సీట్లు మరలా ఇప్పుడు గెలుచుకునే పరిస్థితి లేదు ఒక్క కడప తప్ప మిగతా స్థానాల్లో మరలా వారే గెలుస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ పార్టీలు హోదా అంశంతోనే ఎన్నికలకి వెళితే అది టీడీపీకే ప్లస్ అవుతుంది ఎందుకంటే ఏపీకి మోడీ చేసిన మోసం, మోడీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్న జగన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది.

కాబట్టి ఈ సారి ఎలా అయినా ఆ సీట్లను కూడా టీడీపీ తమ ఖాతాలో వేసుకునే అవకాసం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రానున్న ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే నాలుగేళ్ల కిందట పార్టీ పెట్టినా ఇంత వరకు ఒక్క ఎన్నికలోనూ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు జనసేన. నాలుగో ఆవిర్బావ దినోత్సవసభలో మాత్రం త్వరలో ఏపీలో జరగబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థుల్ని నిలబెడతానని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభ్యర్ధులను నిలబెట్టాలి అంటే అంత బలమయిన అభ్యర్ధులని ఇప్పటికిప్పుడు వెదికిపట్టుకోవడం కష్టం. వెనక్కి తగ్గితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అలాగే పోటీ చేసి ఓడిపోతే అది రానున్న సార్వత్రిక ఎన్నికలకి ఎంత పెద్ద దెబ్బ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవక్కరలేదు. అయితే ఐదు లోక్ సభ సీట్లలో టీడీపీ- వైసీపీ మధ్యే ఉంటుంది. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే టీడీపీకే ఈ ఉప ఎన్నికలు ప్లస్ అవుతాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.