ఎన్టీఆర్ బయోపిక్ లో రాజశేఖర్, కారణం ఇదే

Rajasekhar to play Chandrababu character in NTR Biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ ఏపీ సీఎం అవ్వడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే రాజశేఖర్‌ ఏపీ సీఎం అయ్యేందుకు ఓకే చెప్పాడు అయితే అది రియల్‌ లైఫ్‌లో కాదు రీల్‌ లైఫ్‌లో..! అన్నగారు ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న బయోపిక్‌ చిత్రంలో యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను పోషించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు తేజకు రాజశేఖర్‌ ఫ్యామిలీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే తేజ అడగగానే రాజశేఖర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ జీవితంలో చంద్రబాబు నాయుడు పెద్ద విలన్‌ అంటూ ఒక వర్గం వారు అంటూ ఉంటారు. కాని బాలయ్య చేయబోతున్న ఎన్టీఆర్‌ చిత్రంలో మాత్రం చంద్రబాబు నాయుడును మరో హీరోగా చూపించబోతున్నారు. బాలయ్య తర్వాత అంతటి స్థాయి పాత్ర రాజశేఖర్‌కు ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని బలోపేతం చేసేందుకు, తెలుగు దేశం పార్టీకి ఓట్లు పడేలా చేసేందుకు ఈ సినిమాను వినియోగించుకోనున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు పాత్రను స్టార్‌ హీరోతో చేయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్‌ సినిమా జీవితం, రెండవ పార్ట్‌లో రాజకీయ జీవితంను చూపించేందుకు స్క్రిప్ట్‌ సిద్దం అయ్యింది. ఎన్టీఆర్‌ చిత్రానికి రాజశేఖర్‌ ఏమేరకు హెల్ప్‌ అవుతాడు అనేది చూడాలి.