రక్త చరిత్ర నటుడు అరెస్ట్…

సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నటుడు ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీస్టులు తెలిపారు. ఈ మధ్య ఎజాజ్ ఖాన్ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇలా రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచేలా ఓ వీడియోను పోస్ట్ చేసినందుకు గత ఏడాది కూడా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

అంతేకాకుండా డ్రగ్స్ కేసులో కూడా 2018లో ఓసారి అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఎజాజ్ ఖాన్‌ రక్త చరిత్ర సినిమా బుక్కరెడ్డి క్యారెక్టర్ చేసాడు. అతడిపై తొలుత సమన్లు జారీసేసిన పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. సెక్షన్ 135ఏ తో పాటు పలు సెక్షన్ల కింత అతనిపై కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.