మెగాస్టార్ చిరంజీవి రక్తదానం

కరోనా వైరస్ తో ప్రపంచమంతా అల్లల్లాడిపోతుంది. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేలమంది మృతి చెందారు. కాగా ఈ లాక్ డౌన్ వేళ రోగులు, తలసేమియాతో భాధ పడుతున్న పిల్లలకోసం మెగాస్టార్ రక్త దానం చేసారు. దేశంలో లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఏర్పడిన భయం వల్ల చాలా మంది రక్తదానం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం విషయంలో తీవ్ర కొరత ఏర్పడింది.

ముఖ్యంగా ఆపరేషన్ లకు అత్యవసర సమయాల్లో రక్తం కొరత చాలా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రేరణను ఇవ్వడానికి సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. కొద్ది రోజులక్రితం హీరో నాని దంపతులు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేసారు. తాజాగా మెగాస్టార్ మెగాస్టార్ కూడా “చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ” లో రక్త దానం చేయడం విశేషం.