ఎట్టకేలకు తల్లిని కలిసిన చిన్నారి..

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. కరోనా బారిన పడిన జీవితాలను చిన్నభిన్నం చేస్తంది. అయితే అది వైద్య సిబ్బంది బంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లోనే ఉంటున్నారు. దీంతో వారి పిల్లలు తల్లిదండ్రులను మిస్ అవుతున్నారు. వారి ప్రేమానురాగాలను చంపుకొని బంధాలను తెంపుకొని బ్రతుకుతున్నారు. తాజాగా కర్నాటకలో ఓ తల్లి కూతురు ప్రేమకు దూరమై చివరకి కలుసుకోవడం గుండెలను పిండేసింది.

ఊహ కూడా తెయని… మూడేళ్ల చిన్నారి తన తల్లిని మిస్ అయిన ఘటన కర్ణాటకలో జరిగింది. అది ఈ మధ్య అందరి హృదయాలను కదిలించింది. ఆ చిన్నారి తన తల్లిని 15 రోజుల నుంచి చూడలేదు. అమ్మ కనిపిచకపోవటంతో ఆ చిన్నారి ఇంట్లో గోల గోల చేసస్తోంది. ఓ సారి అమ్మను దూరం నుంచే చూసి.. అమ్మా అమ్మా అంటూ తీవ్రంగా దుఖించింది. ఆ దృశ్యాలను చూసిన వారి గుండెలు కరిగిపోయాయి.

కాగా కర్ణాటకలోని బెలగం జిల్లాలో బెలగం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (బిమ్స్) ఆస్పత్రిలో కోరనా సోకి ఐసోలేషన్ వార్డు నిండిపోయింది. సునంద కొర్‌పూర్ అనే నర్సు తన విధులను తీరిక లేకుండా నిర్వహిస్తోంది. వైరస్ సోకిన ఐసోలేషన్ వార్డులో సునంద డ్యూటీ చేస్తుండటంతో.. 15 రోజులు నుంచి ఇంటికి వెళ్లలేకపోయారు. జిల్లాలో వైరస్ సోకి ఏడుగురు చనిపోవడంతో వైద్య సిబ్బందికి కూడా ఆస్పత్రిలోనే వసతి ఏర్పాటు చేశారు. 24 గంటలు రోగులకు సేవ చేస్తున్నారు. కాగా సునందకు పెళ్లి కావటంతో భర్త.. మూడేళ్ల కూతురు ఐశ్వర్య ఉన్నారు. ఆ చిన్నారి తల్లిపై బెంగ పెట్టుకుంది.

అయితే ఐశ్వర్య తల్లిని చూడకపోవడంతో బెంగ పెట్టుకుంది. ఓసారి.. అమ్మను చూపించాలని నాన్న శ్రీకాంత్ వద్ద గోల చేసింది. చిన్నారి గోల భరించలేక ఆ తండ్రి ఎలా గోలా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ ఏదో సర్దిచెప్పి తీసుకు రావొచ్చు అనుకొన్నాడు. కానీ సమస్య మరింత ఎక్కువైంది. ఏడుపులు, పెడబొబ్బులతో ఆస్పత్రి దద్దరిల్లిపోయింది. అక్కడున్న వారు కూడా చిన్నారి పట్ల తీవ్రంగా ఎమోషన్ అయ్యారు. ఐసోలేషన్ వార్డు వద్దకు వెళ్లేందుకు కుదరకపోవడం.. దీంతో క్యాంటిన్‌లో శ్రీకాంత్ వేచి ఉన్నారు. మమ్మీ.. మమ్మీ.. అని మారం చేసిన చిన్నారికి నచ్చజెప్పలేకపోయాడ ఆ తండ్రి. చివరికి క్యాంటిన్ వద్దకు తీసుకొచ్చాడు. తల్లిని చూసి చిన్నారి దగ్గరికి తీసుకోవాలని కోరింది.

కానీ ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆ తల్లి మనస్సు అంగీకరించలేదు. కొంచెం దూరంలో ఉండి చిన్నారితో మాట్లాడింది. దగ్గరికి రావాలని పాప కోరడంతో.. ఏం చేయాలో.. ఏం చెప్పాలో తెలియని ఆ తల్లి కంట్లోంచి వస్తోన్న నీరు ఆపుకొని అటు తిప్పి గుక్కపట్టుకొని మరీ ఏడ్చేసింది. తన బాధ చెపుకోలేనిది అని ఆ చిన్నారి తల్లీ సునంద తెలిపారు. తాజాగా ఆ చిన్నారి తల్లిని చేరి ఇన్నాళ్లు తనను వదిలి పెట్టి ఎక్కడికి వెళ్లావ్ అంటూ గుక్కపెట్టి మరీ ఏడ్చేసి మరొకసారి అందరినీ ఏడ్పించింది.