తెలంగాణలో మే 7వరకు లాక్ డౌన్..?

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది. అన్ని ప్రపంచ దేశాలు తల్లిడిల్లిపోతున్నాయి. దీంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. అయితే కేంద్రప్రభుత్వం మే3వ తేదీ వరకు దేశమంతా విధిగా లాక్ డౌన్ పాటించాలని మరోసారి తాజాగా ప్రకటించింది. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో లాక్ డౌన్ కు సంబంధించిన సడలింపులు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ కీలక సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. అలాగే… ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా తెలంగాణలో ఫుడ్ డెలివరీ సర్వీసులను కూడా అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. లాక్ డౌన్ ను పొడిగిస్తే.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తున్నారు.