ఎన్టీఆర్‌, చరణ్‌ మూవీ… ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌!

Ram Charan and NTR brothers in Rajamouli multistarrer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌ జక్కన్న ‘బాహుబలి’ తర్వాత చేయబోతున్న సినిమాపై మెల్ల మెల్లగా క్లారిటీ వస్తుంది. గత ఆరు నెలలుగా జక్కన్న తర్వాత సినిమా ఏంటని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఒక క్లారిటీ రావడంతో ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించబోతున్న తర్వాత సినిమా మళ్లీ ‘బాహుబలి’ స్థాయిలో ఉండబోతుందని తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. నందమూరి, మెగా హీరోల మల్టీస్టారర్‌గా జక్కన్న తర్వాత సినిమా ఉంటుందని తేలిపోయింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు కలిసి నటించబోతున్న ఈ సినిమాలో వీరిద్దరు అన్నదమ్ముళ్లుగా కనిపించబోతున్నారట. ఈ విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు అన్నదమ్ములుగా నటిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే వీరిద్దరిలో ఎవరు అన్న, ఎవరు తమ్ముడు అనే విషయంలో కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఒక హీరోను అన్నగా చూపిస్తే ఆయన అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జక్కన్న రాజమౌళి అన్నదమ్ముళ్లుగా వారికి ఎలాంటి పాత్రలను క్రియేట్‌ చేస్తాడు, వాటి ద్వారా ప్రేక్షకులను, అభిమానులను ఎలా సంతృప్తి పర్చుతాడు అనేది చూడాలి.