ఆర్ఆర్ఆర్ చిత్రంతో చాలా బిజీగా గడుపుతున్న రామ్ చరణ్ తేజ్

ఆర్ఆర్ఆర్ చిత్రంతో చాలా బిజీగా గడుపుతున్న రామ్ చరణ్ తేజ్

మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ చిత్రంతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంతో పాటు ఇతర సినిమాలను కూడా నిర్మిస్తున్నారు రాంచరణ్… కాగా ఇదివరకు తాను నిర్మించిన సైరా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  సినిమా చిత్రీకరణలో బిజీగా పాల్గొంటున్నారు. ఇకపోతే రాంచరణ్ తాజాగా తన తండ్రి చిరంజీవి ఏర్పాటు చేసుకున్నటువంటి రీ యూనియన్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించాడు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన మాదిరిగానే, తాను కూడా ఈతరం నటీనటులతో కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రాంచరణ్. అన్నీ సరిగ్గా కుదిరితే 2020 నుండి రీ యూనియన్ పార్టీ ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్… కాగా ఈ మెగా వారసుడు ఏర్పాటు చేయాలనుకున్న ఈ మెగా ప్లాన్ వర్కౌట్ అవుతే చరణ్ కొత్త ట్రెండ్‌కు తెర తీసినట్లే అని చెప్పుకుంటున్నారు కొందరు విశ్లేషకులు…