బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ విజువల్ ఎపిక్ ‘రామాయణ’ Ramayana బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుని ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది.
బుక్ మై షోలో వరుసగా రెండు రోజులు రికార్డు!
భారత్‌లో విడుదలైన మొదటి 24 గంటల్లోనే ఈ సినిమా 1 మిలియన్‌కు పైగా టికెట్లను విక్రయించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలోనే 1 మిలియన్ బుకింగ్స్ మార్క్‌ను దాటినట్లు ప్రచారం జరిగింది.
ఇప్పుడు రెండో రోజు కూడా అదే స్థాయిలో దూసుకెళ్తూ మరోసారి 1 మిలియన్ టికెట్ సేల్స్‌ను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులు ఈ స్థాయి బుకింగ్స్ నమోదు చేయడం సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను సూచిస్తోంది.
వీకెండ్‌లో మరింత పెరగనున్న వసూళ్లు?
ప్రస్తుతం బుకింగ్స్ ట్రెండ్ ఆశాజనకంగా ఉండటంతో శనివారం, ఆదివారం వీకెండ్ రోజుల్లో టికెట్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే సినిమా బాక్సాఫీస్ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. మరి వీకెండ్ ముగిసే సమయానికి ‘రామాయణ’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.





