ఎన్టీఆర్ లో చంద్రబాబుగా రానా….ఫస్ట్ లుక్ !

Rana Daggubati Look As Chandrababu Naidu From NTR Biopic

మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు జీవిత్ర చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ కథానాయకుడిగా భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా లీక్ అయిన రానా ఫోటో సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.. ఈ సినిమాలో రానా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తొలి సినిమా లీడర్ లోనే సీఎం గా నటించి మెప్పించిన రానా..సీఎం చంద్రబాబు పాత్రలో ఎలా ఉంటాడు? ఎలా మెప్పిస్తాడు? అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా లీకైన ఫోటో ఆ ఆసక్తిని మరింత పెంచింది.

rana in Chandrababu naidu

అయితే తాజాగా వినాయాక చవితి సందర్భంగా రానా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. లీక్ అయిన పిక్ తోనే సంబరాలు చేసుకున్న అభిమానులు ఇప్పుడు విడుదల అయిన పిక్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ ఫోటోతో దర్శనమిచ్చారు. ఈ ఫోటోని చూసిన వారు నారా వారి లుక్ లో రానా అదరగొట్టేసాడుగా అంటూ ప్రశంసిస్తున్నారు. ఒక్క ఫొటోతోనే ఇంతలా అంచనాలు రేపుతున్న రానా, రేపు సినిమాలో ఎంతగా అంచనాలను చేరుకుంటాడో వేచి చూడక తప్పదు.