పోటీ నుండి తప్పుకున్న రానా!

Rana Nene Raju Nene Mantri Movie Release Date August 4th

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rana Nene Raju Nene Mantri Movie Release Date August 4th

‘బాహుబలి’ చిత్రంలో విలన్‌గా నటించిన రానాకు నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. భారీ స్థాయిలో ఆ సినిమాతో పేరు రావడంతో తాజాగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కించినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటేనే అనిపిస్తుంది. భారీ పొలిటికల్‌ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌తో తేలిపోయింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అందుకే ఈ సినిమాను మంచి సమయంలో విడుదల చేస్తే మంచి కలెక్షన్స్‌ వస్తాయనే నమ్మకంతో నిర్మాత సురేష్‌ బాబు ఉన్నాడు.

ఈ చిత్రాన్ని మొన్నటి వరకు ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు మరో మూడు పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి. దాంతో రానా సినిమాను వారం ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 4నే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని, తద్వారా సేఫ్‌ జోన్‌లో రానా రావాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంతో రానా కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. బాహుబలి మినహా రానాకు ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ దక్కింది లేదు.

మరిన్ని వార్తలు:

రాజమౌళి మౌనంలో మర్మం ఏంటబ్బా?

‘సాహో’ కంటే ముందు బాలీవుడ్‌లో..!