కొత్త బాటలోకి అడుగు వేస్తున్న రానా

కొత్త బాటలోకి అడుగు వేస్తున్న రానా

టాలీవుడ్‌ యంగ్ హీరో రానా కొత్త అవతారం ఎత్తాడు. ఇప్పటికే హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా తనలోని డిఫరెంట్‌ ట్యాలెంట్స్‌ చూపించిన ఈ మ్యాన్లీ హంక్‌ తాజాగా ఓ సినిమా కోసం గాయకుడిగా మారాడు. విశాల్‌ హీరోగా సుందర్‌ సీ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ మూవీ `యాక్షన్‌`. పూర్తి స్థాయి యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే ఓ సాంగ్‌ కోసం రానా గొంతు కలిపాడు.

హిప్‌ హాప్‌ తమిళ సంగీత సారథ్యంలో అడుగడుగున పిడుగుల జడి అంటూ సాగే పాటలో రాప్‌ బీట్స్‌ను రానా ఆలపించాడు. హిప్‌ హాప్‌ తమిళ, భువన చంద్ర, పాల్‌ బి సైలస్‌ సాహిత్య మందించగా కౌషిక్‌ క్రిష్, రాజన్‌ చెల్లియా, హిప్‌ హాప్‌ తమిళ, రోల్‌ రిడాలతో కలిసి రానా ఈ పాటను ఆలపించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాుద ఈ సినిమా తమన్నా యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఇరగదీసిందట.

తాజాగా సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల మేకింగ్‌తో, రానా పాట పాడిన విజువల్స్‌తో ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు యాక్షన్‌ చిత్రయూనిట్. విశాల్‌, తమన్నాలు జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ, యోగిబాబు, ఆకాంక్ష పూరి, కబీర్‌ దుహన్‌ సింగ్‌, రామ్‌కీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కార్తికేయ సినిమాస్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక రానా విషయానికి వస్తే  చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రానా ఇటీవల విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు. చివరి దశలో ఉన్న హాథీ మేరీ సాథీ సినిమాతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాల షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. వీటితో పాటు రానా పౌరాణిక పాత్రలో నటించనున్న హిరణ్య కశ్యప షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుందన్న టాక్‌ వినిపిస్తోంది.