అంతర్జాతీయంగా భీమ్ యాప్‌

అంతర్జాతీయంగా భీమ్ యాప్‌

బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టబడిన భీమ్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఆధారంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసిన మొబైల్ చెల్లింపు అనువర్తనం. 30 డిసెంబర్ 2016న ప్రారంభించబడి ఇది 2016 లో డీమోనిటైజేషన్‌లో భాగంగా నేరుగా బ్యాంకుల ద్వారా ఇ-చెల్లింపులను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. అదే విధంగా నగదు రహిత లావా దేవీల వైపు నడిపించడానికి ఉపయోగ పడింది. యుపిఐని ఉపయోగించే అన్ని భారతీయ బ్యాంకులకు మద్దతు ఇస్తూ తక్షణ చెల్లింపు సేవ(IMPS) మౌలిక సదుపాయాలపై నిర్మించబడింది. ఏదైనా రెండు పార్టీల బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బును తక్షణమే బదిలీ చేయడానికి వినియోగదారుని అనుమతిస్తు ఇది అన్ని మొబైల్ పరికరాల్లో ఉపయోగించెల అందుబాటులో ఉంది.

ఇలా దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్‌ యాప్‌ అంతర్జాతీయంగానూ అడుగు పెడుతోంది. 2020 ఫిబ్రవరికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తూ తాజాగా సింగపూర్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో యాప్‌ ప్రదర్శన జరిగినది. సింగపూర్‌లోని నెట్‌వర్క్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ఇంకా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రెండు  సంస్థలు అందుబాటులోకి భీమ్‌ యాప్‌ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఎస్‌జీక్యూఆర్‌ భీమ్‌ యాప్‌తో క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా భారత హై కమిషనర్‌ జావేద్‌ అష్రాఫ్‌ సింగపూర్‌లో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో చూపించారు. భారత్ కాకుండా ఇతర దేశాల్లో భీమ్‌ యాప్‌ ఉపయోగించడం ఇదే మొదటిసారి. సింగపూర్‌లో 2020 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.