రానా సోష‌ల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ranas-web-series-social-poster-released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమాలు, టీవీ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న యువ హీరో రానా..ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలోనూ ప్ర‌వేశిస్తున్నారు. ఆయ‌న న‌టించిన సోష‌ల్ వెబ్ సిరీస్ ఈ నెల 8వ‌తేదీ నుంచి వియూ వెబ్ చాన‌ల్ లో ప్ర‌సారం కానుంది. యువ‌త‌పై సోష‌ల్ మీడియా ప్ర‌భావాలే క‌థాంశంగా ఈ వెబ్‌సిరీస్ ను తెర‌కెక్కించారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ అయింది. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వెబ్ సిరీస్ లో న‌టించ‌టంపై రానా ఆనందంగా ఉన్నారు. సోష‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు ఓ కొత్త రానా వ‌స్తున్నాడ‌ని ఆయ‌న చెప్పారు.

డిజిట‌ల్ మీడియాలో ఇది త‌న తొలి అడుగు అన్న రానా…ఈ వెబ్ సిరిస్ ను అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. త‌ప్పిపోయిన ఓ యువ‌తి మిస్ట‌రీని సోష‌ల్ మీడియా ద్వారా ఎలా చేధించార‌న్న‌ది సోష‌ల్ వెబ్ సిరీస్ లో 13 ఎపిసోడ్లుగా ప్ర‌సారం చేయ‌నున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్ ను శ‌శి సుడిగాల ద‌ర్శ‌క‌త్వంలో వ్యాక‌వుట్ మీడియా, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. సోష‌ల్ లో రానా తో పాటు న‌వీన్ క‌స్తూరియా, ప్రియా బెనర్జీ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డిజిటల్ మీడియాకు రోజురోజుకూ ఆద‌ర‌ణ పెరుగుతోన్న నేప‌థ్యంలో టాలీవుడ్ లో అంద‌రిక‌న్నా ముందుగా రానా…వెబ్ సిరీస్ వైపు అడుగులేశారు.సోష‌ల్ స‌క్సెస్ అయితే రానా బాట‌లో మ‌రికొంత‌మంది తెలుగు హీరోలు, న‌టీన‌టులు వెబ్ సిరీస్ లో న‌టించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు.

మరిన్ని వార్తలు:

పైసా వసూల్ మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

నిఖిల్‌ పెళ్లి క్యాన్సిల్‌, కారణం..!

ఆకాష్‌ కోసం చిన్న సైజు పోకిరి..