బన్నీ కోసం ‘పుష్ప 2’ లో రణ్ వీర్ సింగ్!

బన్నీ కోసం 'పుష్ప 2' లో రణ్ వీర్ సింగ్!
pushpa-2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరేక్షన్ లో ‘పుష్ప 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ సుకుమార్ పార్ట్2 రూపొందిస్తున్నారు.ఈ సినిమాలో బన్నీ లుక్ కూడా కాస్త డిఫరెంట్ ఉంటుంది అని ఆల్రెడీ మేకర్స్ చెప్పేసారు. అండ్ ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అందుకని ఈ సినిమాలో అన్ని కన్నడ హిందీ భాషల నుంచి మరికొంతమంది స్టార్స్ ఉండేలా చూస్తున్నారు.

ఈ సందర్బంగా బాలీవుడ్ నుంచి కొంతమంది హీరోస్ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా రణ్ వీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. పుష్ప మూవీలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉండటంతో, వెంటనే ఆయన అంగీకరించాడని కూడా తెలుస్తుంది.

బన్నీ కోసం 'పుష్ప 2' లో రణ్ వీర్ సింగ్!
pushpa-2

తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో, తెలుగు సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్ కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇదే తరహాలో ఒక వైపున ఎన్టీఆర్ సినిమా కోసం సైఫ్ .. మరో వైపున మహేశ్ మూవీ కోసం అక్షయ్ కుమార్ పేర్లు వినిపిస్తుండగా, తాజాగా ‘పుష్ప 2’ కోసం రణ్ వీర్ పేరు వినిపిస్తుండటం గమనార్హం.