కొలీగ్ మీద రేప్ కేసు…నిందితుడి అరెస్ట్ !

Rape Case Filed On Cheated Lover
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తన తోటి సేల్స్‌గర్ల్‌ ను శారీరికంగా వాడుకుని ఇప్పుడు పెళ్ళనేసరికి ముఖం చాటేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అందుతున్న సమాచరం ప్రకారం కర్నూల్‌ జిల్లాకి చెందిన ఫ్రాంక్లిన్ (28) ఒడిశాలోని బరంపురానికి చెందిన యువతి(26) ఓ షాపింగ్‌మాల్‌లో సేల్స్‌ విభాగంలో పని చేసేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెను శారీరికంగా వాడుకున్నాడు. అయితే గర్భం దాల్చిన యువతి విషయాన్ని అతనికి చేరవేయగా అబార్షన్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చాడు.
Lovers
అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో అతను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వగ్రామానికి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఈ నెల ఆగస్టు 19న ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.  హాస్టల్ వారు ఆమెను సనత్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ప్రేమపేరుతో మోసం చేసిన ఫ్రాంక్లిన్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు గత నెల 31న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని శనివారం అరెస్ట్‌ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.