ఆ చిత్రం నుంచి వైదొలగిన రష్మిక మందానా…!

Rashmika Mandanna Canceled In Kannada Movie Vrithra

చలో సినిమాతో యువకులు మనసులు దోచుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన కెరీర్ మొదలుపెట్టడం తోనే కిరిక్ పార్టీ అనే సినిమా తో విజయవంతం గా మొదలు పెట్టింది . ఆ తరువాత వొచ్చిన గీత గోవిందం కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నుండి ఈ కన్నడ బ్యూటీ వరుస వివాదాలలో తిరుగుతుంది. కిరిక్ పార్టీ దర్శకుడు రక్షిత్ తో నిశితార్థం అయినా తరువాత కెరీర్ మీద ద్రుష్టి సారించాలని అతని తో వివాహం రద్దు చేసుకుంది. దీనితో కన్నడ సినిమా ప్రేమికులు ఆమె పై తీవ్రం గా మండిపడ్డారు, ఆమెని ట్రోల్ చేస్తూ రకరకాలుగా ట్వీట్స్ చేసారు. వీటన్నిటికీ చెక్ పెడ్తూ రక్షిత్ తనని ఎవరు ఏమి అనవద్దు అని ఇది ఇద్దరికి ఇష్టం అయ్యే రద్దు చేసుకున్నాం అని వివరణ ఇచ్చాడు.

rashimika-mandhana

ఇక విషయానికి వస్తే చలో, గీతగోవిందం తో వరుస విజయాలు సాధించిన రష్మిక తెలుగు లో నాగార్జున నాని కలయిక తో వస్తున్న దేవా దాస్ సినిమా లో చేస్తుంది. అంతే కాకుండా విజయ్ దేవరకొండ తో ఇంకో సినిమా కూడా చేస్తూ తెలుగు లో టాప్ హీరోయిన్ అవ్వాలనే ప్రయత్నం లో ఉంది. వరుస అవకాశాలు వస్తున్నాయి ఈ సమయం లో పెళ్లి చేసుకొని వీటన్నిటిని మిస్ కాకూడదు అని పెళ్లి ని కూడా రద్దు చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ . ఇదిల ఉండగా తాజాగా ఒక కన్నడ చిత్రం నుండి వైదొలగిందనే వార్తలు షికార్లు చేసాయి ఇప్పుడు దీని పై రష్మిక నేరుగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించింది

rashimika-mandhana-kannada

కన్నడ లో తాను ఒప్పుకున్నా ‘వ్రిత్రా’ చిత్రం నుండి నేను వైదొలిగానని ఆ చిత్రం లో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పింది, నా కెరీర్ ఇంకా ఆరంభం లోనే ఉంది అని ఇప్పుడే ఇల్లాంటి సినిమాలు చేయకుండా ఉంటె మంచిదనే ఉద్దేశం తోనే వైదొలుగుతున్నాను అంటూ పేరుకొంది. ఇదే విషయాన్నీ చిత్ర నిర్మాతకు దర్శకుడు కు తెలియ చేసానని వారు కూడా సంతోషం గా ఒప్పుకున్నారు అని చెప్పింది. చిత్రం నుండి వైదొలగిన విషయాన్నీ వెల్లడించిన రష్మిక దానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తన సన్నితుల దగ్గర నుండి వస్తున్న సమాచారం ప్రకారం ‘వ్రిత్రా’ లో తనది పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్వ్ ఆఫీసర్ పాత్రని ఆ పాత్రని చెయ్యడానికి దైర్యం చాలకే వైదొలగింది అని చెప్తున్నారు. చిత్రమేంటంటే ‘వ్రిత్రా’ దర్శకుడు గౌతమ్ రక్షిత్ మంచి స్నేహితులు ఒక వేళా ఈ కారణం కూడా అయ్యి ఉండచ్చు అని నెటిజెన్ల్ అనుకుంటున్నారు.