తమిళ వివాదాస్పద నటి…వేదింపుల కేసు…!

Neelani Filed A Case On Her Lover

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరిగిన తమిళనాడు స్టెర్‌లైట్‌ ఉద్యమంలో పోలీసుల దుస్తుల్లో పాల్గొన్న ఒక నటి కేసు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన సదరు నటి మళ్లీ తన పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఆ నటీమణి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తనను పెళ్లి చేసుకోవాలని తనను బలవంతం చేస్తున్నాడంటూ బుల్లితెర నటి నీలాణి తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైలాపూర్ పోలీసులను ఆశ్రయించిన తమిళ నటి నీలాణి పని చేసే చోటుకు వచ్చి పచ్చి బూతులు తిడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు నటి టీవీ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ పేరు తెచ్చుకుంటోంది. గాంధీ లలిత్‌కుమార్‌ అనే వ్యక్తితో ఆమెకు మూడేళ్ల కిందట పరిచయమైంది.

nilani

ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి మధ్య మనస్పర్థల కారణంగా కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నటి నీలాణి ఆదివారం స్థానిక మైలాపూర్‌లో జరుగుతున్న ఓ సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొంది. షూటింగ్ స్పాట్‌కు వచ్చిన లలిత్ కుమార్ తనను పెళ్లి చేసుకోవాలని నీలాణిని బలవంతం చేయగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన గాంధీ గొడవకు దిగి బూతులు తిడుతూ నానా రాద్ధాంతం చేసినట్లు సమాచారం. దీంతో టీవీ సీరియల్‌ షూటింగ్‌లో కలకలం చెలరేగింది. ప్రియుడి వేధింపులు భరించలేదని నటి ఆదివారం పోలీసులను ఆశ్రయించి లలిత్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. అతడితో తనకు మూడేళ్ల పరిచయం ఉందని, తామిద్దరం ప్రేమించుకున్నామని మనస్పర్థల కారణంగా ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్నానని, అతడిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని.. అయినా పెళ్లి చేసుకోవాలని షూటింగ్ స్పాట్‌కు వచ్చి వేధిస్తున్నాడని నీలాణి తన ఫిర్యాదులో పేర్కొంది.

nilani-tamil-actor