హలో  గురు ప్రేమ కోసమే టీజర్ !

Hello Guru Prema Kosame Teaser
ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురూ ప్రేమ కోస‌మే`. వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న మ‌రో సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థా చిత్రం కావ‌డంత‌తో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.  సినిమా చూపిస్త మావ‌, ‘నేను లోకల్‌’ సినిమాలతో హిట్‌ కొట్టిన త్రినాథరావు నక్కినతో కలిసి ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించాడు.
hello guru prema kosame
హలో గురు ప్రేమ కోసమే అంటూ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించేలా చేశారు చిత్రబృందం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ లో ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌ సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్  ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. అంచనాలను మరింత పెంచేసేలా ఉన్న ఈ టీజర్ మీద మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి.