TG Politics: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం

TG Politics: Clash between BRS MLCs and Police
TG Politics: Clash between BRS MLCs and Police

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు నిలువరించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో నిరసన తెలపడం మా హక్కు..కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని..వెంటనే సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం రేవంత్‌ ఇలాంటివి మాట్లాడకూడదని ఆగ్రహించారు. పోడియం చుట్టిముట్టి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీలు.. అందోళన చేయండంతో సభను కౌన్సిల్ చైర్మన్ గుత్తా 10 నిమిషాల వాయిదా వేశారు.