IT ఉద్యోగులకు అలర్ట్.. WFH చేసుకోవాలని పోలీసుల సూచన..

Alert to IT employees.. Police advice to do WFH.
Alert to IT employees.. Police advice to do WFH.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం నమోదు అయింది. మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కూకట్‌పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13, గాజుల రామారంలో 12.5, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, మూసాపేట్, జూబ్లీ హిల్స్ , షాపూర్ లో 12, కుత్బుల్లాపూర్ లో 11.5, మాదాపూర్ లో 11.4,రాజేంద్రనగర్ ,సికింద్రాబాద్ లో 11.2, అల్వాల్, బేగంపేట్, కేపీహెచ్‌బీ, శేలింగంపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ఇక అటు హైదరాబాద్ హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు జలమండలి అధికారులు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 442 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఈ తరుణంలోనే తెలంగాణ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదన్నారు. ఐటీ ఉద్యోగులు WFH(వర్క్ ప్రమ్ హోమ్) చేసుకోవాలి.. అత్యవసర ఉద్యోగులు ఆఫీస్ నుండి ఇంటికి వర్షాభావపరిస్థితిని బట్టి బయల్దేరాలని తెలంగాణ పోలీసులు కోరారు.