చైన్‌ స్నాచ్యింగ్లకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ అరెస్ట్

చైన్‌ స్నాచ్యింగ్లకు పాల్పడ్డ ఆటో డ్రైవర్ అరెస్ట్
chain snatching

ఆన్‌లైన్ గేమింగ్‌లో నష్టాన్ని పూడ్చుకునేందుకు చైన్‌ స్నాచ్యింగ్ లకు పాల్పడ్డ ఆటోరిక్షా డ్రైవర్ మణుగూరు మహిపాల్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో అల్లాపూర్‌లో, ఆగస్టులో మాదాపూర్‌లో రెండు కేసుల్లో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ జి. సుదీప్ తెలిపారు. మహిపాల్ ఏకాంత ప్రదేశాల్లో నడిచే వృద్ధులను టార్గెట్ చేసేవాడు. ఆన్‌లైన్ గేమ్ కోసం తన భార్య నగలను కూడా తాకట్టు పెట్టాడు అని తెలిపారు.