కమెడియన్‌కు ఛాన్స్‌… రవితేజ షాకింగ్‌ నిర్ణయం

Raviteja To Do with Comedian Srinivas Reddy Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రవితేజ కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త దర్శకులతో పని చేశాడు. ప్రస్తుతం కూడా విక్రమ్‌ సిరి అనే దర్శకుడిని ‘టచ్‌ చేసి చూడు’ అనే చిత్రంతో పరిచయం చేస్తున్నాడు. పలువురు దర్శకులను పరిచయం చేసిన రవితేజ తాజాగా మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రవితేజ అవకాశం ఇచ్చిన దర్శకుల్లో పలువురు స్టార్‌ దర్శకులు అయ్యారు. అందుకే కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా రవితేజతో పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాడు.

కమెడియన్‌గా చాలా సంవత్సరాలుగా ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న శ్రీనివాసరెడ్డి హీరోగా కూడా ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యాడు. ఎక్కువగా హీరో పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపని శ్రీనివాస రెడ్డి కమెడియన్‌ పాత్రకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. త్వరలోనే దర్శకుడిగా మారాలనే యోచనలో శ్రీనివాసరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కథలను సిద్దం చేసుకున్న శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకునే పనిలో ఉన్నాడు.

గతంలో సహాయ దర్శకుడిగా కూడా పని చేసిన శ్రీనివాసరెడ్డి త్వరలోనే ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. రవితేజతో ఒక మాస్‌ మసాలా చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత రవితేజ తన తర్వాత సినిమాను శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తాడని సమాచారం. అయితే రవితేజ గత కొంత కాలంగా బ్యాడ్‌ టైం జోన్‌లో ఉన్నాడు. ఈయన చేస్తున్న సినిమాలు నిరాశను మిగుల్చుతున్నాయి. తాజాగా విడుదలైన ‘రాజా ది గ్రేట్‌’ మాత్రం సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది. ఈ సమయంలో మళ్లీ ప్రయోగం చేయడం వల్ల కెరీర్‌కు నష్టం అంటూ కొందరు అంటున్నారు. కాని కొత్త వారితో చేసిన ప్రతి సారి కూడా రవితేజకు కలిసి వచ్చింది. అందుకే ఈసారి కూడా రవితేజ అదే నమ్మకంతో శ్రీనివాసరెడ్డికి చాన్స్‌ ఇచ్చాడు.