ఎన్టీఆర్, సునీల్ కాంబినేషన్ లో …

Sunil back to comedian

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హీరో సునీల్ మళ్లీ కమెడియన్ అయ్యేది ఏ సినిమాతో అనేది దాదాపుగా తేలిపోయింది. తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో సునీల్ కమెడియన్ గా కనిపిస్తాడట. ఈ విషయంలో ఇద్దరు మిత్రులు మాట్లాడుకోవడంతో పాటు ఎన్టీఆర్ దగ్గర కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. ఈ సినిమాలో సునీల్ కోసం త్రివిక్రమ్ ఓ చిత్రమైన మ్యానరిజం తో కూడిన క్యారెక్టర్ డిజైన్ చేశారట. ఈ క్యారెక్టర్ తర్వాత మళ్లీ సునీల్ కమెడియన్ గా ఫుల్ బిజీ కావడం ఖాయం అంటున్నారు.

సునీల్, త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. అందుకే సునీల్ హీరోగా మారాక కొన్ని సినిమాల్లో అతని క్యారెక్టర్, డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ ఇన్ పుట్స్ ఇచ్చిన సందర్భాలు వున్నాయి. అయితే త్రివిక్రమ్ రేంజ్ పెరగడం, సునీల్ హీరోగా చేసిన సినిమాలు అపజయం పొందడం సమాంతరంగా జరుగుతూ వచ్చింది. త్రివిక్రమ్ అటు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేయడంతో సునీల్ తో సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ మధ్య వచ్చిన ఉంగరాల రాంబాబు సినిమాతో హీరోగా సునీల్ కెరీర్ పూర్తి స్లంప్ లో పడింది. అందుకే ఆ సినిమా ప్రమోషన్ టైం లోనే మళ్లీ కామెడీ పాత్రలు చేస్తానని సునీల్ చెప్పేసారు. మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాతో రీ ఎంట్రీ అన్న మాట వినిపించినప్పటికీ అందులో కామెడీ కి పెద్ద స్కోప్ లేకపోవడంతో ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని సునీల్ డిసైడ్ కావడం, త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ఓకే అనడం చకచకా జరిగిపోయాయట.