చెవి మీద వెంట్రుకలే హోమ్ మినిస్టర్ అదృష్టం అట.

reason behind Telangana Home Minister Nayani Narasimha Reddy good luck

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ని దగ్గరగా చూస్తే ఆయన మొహం కాస్త స్పెషల్ గా అనిపిస్తుంది. అందుకు కారణం నాయిని చెవుల మీద గుబురుగా పెరిగిన వెంట్రుకలే. చెవి మీద వెంట్రుకలది ఏముంది అని మీరు అనుకోవచ్చు . కానీ నాయిని మాత్రం వాటిని తన అదృష్టంగా భావిస్తారట. అందుకే వాటిని ఎప్పుడూ కత్తిరించే ప్రయత్నం చేయరట.

నాయిని తన సన్నిహితులతో కూర్చున్నప్పుడు ఈ టాపిక్ వస్తూనే వుంటుందట. నాయిని సెంటిమెంట్ గురించి తెలియని వాళ్ళు ఎప్పుడైనా వాటిని కత్తిరించుకోవచ్చు కదా అని ఉచిత సలహా పారేయడం దాన్ని నాయిని పట్టించుకోకపోవడం చాలా సార్లు జరుగుతుందట. తెలంగాణ ఉద్యమ సమయంలో నాయిని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. గడ్డు పరిస్థితులు ఎదురు అయినప్పుడు కూడా కెసిఆర్ కి అండగా నిలబడ్డారు. ఆ కారణం వల్ల క్యాబినెట్ లో ముఖ్యమైన హోమ్ శాఖామంత్రిగా నాయిని ని ఎంపిక చేశారు. అయితే చెవి మీద వెంట్రుకల పాత్ర ఉందని నాయిని నమ్మడం ఆయన వ్యక్తిగతం.