ఇంకా ఎంత పెంచుతావు… ఎంత చూపినా కష్టమే

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Regina hot exposing for movie chances

హీరోయిన్‌ రెజీనా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. రెజీనా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఒకే సమయంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇద్దరు కూడా చిన్న హీరోలతో నటించి మెల్ల మెల్లగా కెరీర్‌ను స్టార్‌ చేశారు. అయితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాత్రం అదృష్టం కొద్ది వరుసగా అవకాశాలు దక్కించుకుంది. రెజీనా మాత్రం అదృష్టం కలిసి రాకపోవడంతో ఇంకా చిన్న హీరోలతో నటిస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి సరైన బ్రేక్‌ లభించడం లేదు. ఈమె తాజాగా నటించిన ‘నక్షత్రం’ చిత్రంలో అందాల ఆరబోత చేసిన విషయం తెల్సిందే.

regina cassandra hot scenes for movie chances

‘నక్షత్రం’ చిత్రంలో రెజీనా చేసిన అందాల విందు వృదా అయ్యింది. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో రెజీనా అందాల ప్రదర్శణ వృదా అయ్యింది. ఇక తాజాగా రెజీనా నటించిన చిత్రం ‘బాలకృష్ణుడు’. నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా శృతి మించి మరీ అందాల ప్రదర్శణ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ముద్దుగుమ్మ రెజీనా గ్లామర్‌ డోస్‌ మరీ ఎక్కువ చేయడంతో సినిమాకు ఎ సర్టిఫికెట్‌ గ్యారెంటీ అంటున్నారు. ఆ స్థాయిలో గ్లామర్‌ షో చేయడంతో ఇప్పటికైనా బ్రేక్‌ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాని రెజీనాకు బ్రేక్‌ వచ్చే సమయం దాటి పోయింది. ఇక రెజీనా ఖచ్చితంగా సక్సెస్‌ అవ్వలేదని, ఎంత అందాల ప్రదర్శణ చేసినా కూడా వృదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి రెజీనా కెరీర్‌ సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌గా ముగియాల్సిందే అంటున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప రెజీనాకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం రాదు.