ఆ స్పెషల్ డే రోజున రిలీజ్ ఫిక్స్ ?

Prabhas
Prabhas

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. హైటెక్నికల్ వాల్యూస్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతం అవుతున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయిన మూవీపై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచింది..

నిజానికి ఈ మూవీని రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు కొన్ని నెలల క్రితం మేకర్స్ ప్రకటించారు.అయితే సినిమాకి సంబంధించి కొంత షూటింగ్ తో పాటు చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉండడంతో త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని ఇటీవల దర్శకుడు నాగ అశ్విన్ తెలిపారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ ప్రకారం కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ డేట్ పక్కగా ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.

ఇదిలా ఉండగా గతంలో వైజయంతి సంస్థ నుండి జగదేకవీరుడు అతిలోకసుందరి. కంత్రి. మహర్షి. మహానటి అవంతి సినిమాలు మే 9న రిలీజ్ అయ్యాయి. ఇక వీటిలో చాలా వరకు మంచి సక్సెస్ అంత కోవడంతో ఈ స్పెషల్ డే రోజున కల్కి 2898 ఏడిని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్ అలానే త్వరలో దీనిపై అధికారి ప్రకటన ఇవ్వనున్నారట.మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది.