ఈ యంగ్ హీరో కోసం ఎన్టీఆర్..క్లారిటీ ఇదే.!

NTR
NTR

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మరో పక్క అయితే తారక్ పలు ఎండోర్స్ మెంట్స్ యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు.

అయితే లేటెస్ట్ ఓ యంగ్ భారీ చిత్రం ఫ్రీ రిలీజ్ కి అయితే తారక్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు.అని పలు రూమర్స్ వైరల్ గా మారాయి.మరి ఆ యంగ్ హీరో దుల్కర్.సల్మాన్ కాగా తాను నటించిన లేటెస్ట్ చిత్రమే “కింగ్ ఆఫ్ కోత”. అయితే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈ ఆగస్ట్ 13న జరగనుంది.

అయితే దీనికి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తాడు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అన్నట్లు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పాలి.