ఈసారి కేసీఆర్ ని టార్గెట్ చేసిన వర్మ !

తాజాగా వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెలంగాణ సీఎం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ బయోపిక్‌ను కూడా తరువాత చిత్రంగా తియ్యబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్మ ప్రకటించినట్లుగానే సినిమా టైటిల్ ను ఈరోజు ప్రకటించారు. ‘కేసీఆర్ టైగర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో తెలిపారు. ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ సినిమాలో నటీనటుల విషయమై త్వరలోనే వర్మ మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై జీవితం, తెలంగాణ ఉద్యమంపై ‘ఉద్యమ సింహం’ అనే సినిమా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ఎప్పుడు మొదలు పెడతారో, ఇతర నటీనటులుగా ఎవర్ని తీసుకుంటారో చూడాలి.