మెగా ఫ్యాన్స్‌కు భయపడుతున్న వర్మ

RGV tension with mega fans over nagarjuna officer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. జూన్‌ 1న విడుదల కాబోతున్న ‘ఆఫీసర్‌’ చిత్రానికి సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఏ అడ్డంకు లేకుండా ఈ సినిమాను జూన్‌ 1న విడుదల చేయడం ఖాయం అని తేలిపోయింది. అంతా బాగానే ఉంది కాని ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్‌ నుండి ముప్పు పొంచి ఉందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా మెగా హీరోలపై మరియు ఫ్యాన్స్‌పై వర్మ తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆ మద్య కాస్త శృతిమించి పవన్‌ను శ్రీరెడ్డితో నీచంగా తిట్టించాడు. దాంతో మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహంతో రగిలి పోతున్నారు. తమ ఆగ్రహంను ప్రదర్శించేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఆ సమయంలో ‘ఆఫీసర్‌’ రూపంలో వచ్చిందని వారు భావిస్తున్నారు. వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని ట్రోల్‌ చేసి దుమ్ము దుమ్ముగా విమర్శలు చేయాలని మెగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అందుకోసం రెడీ అయ్యారు. ప్రస్తుతం వర్మ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన టార్గెట్‌గా సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఫీసర్‌ విడుదలైన తర్వాత మొదటి నుండే సోషల్‌ మీడియాలో సినిమా ఫ్లాప్‌ అంటూ ప్రచారం చేయాలని, అలాగే వెబ్‌ మీడియాలో కూడా ఆఫీసర్‌ గురించి తప్పుగా రాయాలంటూ మెగా ఫ్యాన్స్‌కు సందేశాలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ తన ఆఫీసర్‌ సినిమా గురించి కాస్త ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం అందుతుంది.