సిక్సుల సునామి చూపిస్తున్నరిషబ్ పంత్..వీడియో వైరల్

Rishab Pant showing Tsunami of sixes..Video viral
Rishab Pant showing Tsunami of sixes..Video viral

గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ సంగతి తెలిసిందే. కారు డివైడర్ ని ఢీకొనడంతో పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడ్డ పంత్ చికిత్స తీసుకొని వేగంగా కోలుకుంటున్నాడు. అయితే.. పంత్ వీపుకు,కాలికి బలమైన గాయాలు కావడంతో, చాలాకాలం మంచానికే పరిమితం అయ్యాడు

ఇది ఇలా ఉండగా, స్వాతంత్ర దినోత్సవం రోజున పంత్.. జేఎస్డబ్ల్యూ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ తన మాటలతో ప్రజల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన పంత్… ఆ తర్వాత బ్యాట్ పెట్టాడు. అలా ఆటలోకి దిగిన రిషబ్ పంత్… సిక్స్ లతో చేరరేగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్… ఫుల్ ఖుషి అవుతున్నారు. పంత్ తిరిగి టీమిండియాలోకి వస్తాడని అందరూ అంటున్నారు.