న్యూ లుక్‌తో రోహిత్‌

న్యూ లుక్‌తో రోహిత్‌

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బరువు తగ్గడంతో పాటు న్యూ లుక్‌తో అదరగొట్టాడు. గత కొంత కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిటేషన్‌లో గడుపుతున్న రోహిత్‌.. బాగా సన్నబడిపోయి, క్లీన్‌ షేవ్‌తో కనిపించాడు. న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇందులో అతను దేనివైపో తీక్షణంగా చూస్తున్నట్టు ఫోజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రోహిత్‌ లుక్‌పై అభిమానులు, టీమిండియా క్రికెటర్లతో పాటు అతని భార్య రితికా సజ్దే కూడా స్పందించింది. క్లీన్ షేవ్‌తో రోహిత్‌ యంగ్‌గా మారిపోయాడని అభిమానులు, సహచర​ క్రికెటర్లు అంటుండగా.. భార్య రితికా మాత్రం ఫన్నీ కామెంట్‌ చేసింది. “వై సో బ్రూడీ” అంటూ రాసుకొచ్చింది. రోహిత్‌ న్యూ లుక్‌పై రితిక చేసిన కామెంట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.