సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న RRR

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో ఎపిక్ విజువల్ వండర్ RRR.స్వాతంత్ర ఉద్యమం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో తారక్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో నటిస్తున్న ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించి వారి అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన వాటిగానే అనిపిస్తుండడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యిపోతున్నాయి.అలా ఇప్పుడు రామ్ చరణ్ కు సంబంధించి ఒక వింటేజ్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ ఫోటోను చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ మేడ్ ఎడిట్ అంటే ఎవ్వరూ నమ్మలేరు.అంత సహజంగా ఈ పోస్టర్ కనిపిస్తుంది.బ్రిటిష్ కాలం నాటి సిపాయిగా 1922 వ సంవత్సరానికి చెందిన ఫోటో టైపులో ఈ పోస్టర్ ఉంది.దీనితో రామ్ చరణ్ అభిమానులు మరియు సినీ అభిమానులు కూడా అసలు ఈ పోస్టర్ నిజమైనది కాదు అంటే నమ్మలేకపొతున్నారు.మొత్తానికి మాత్రం ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది.