భావన పెళ్లి క్యాన్సిల్‌… అక్రమ సంబంధం కారణమా?

Rumours of Bhavana Marriage cancelled with Naveen

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మలయాళ బ్యూటీ భావన కిడ్నాప్‌ మరియు లైంగిక దాడి వ్యవహారం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన వారు స్వయంగా భారీ మొత్తంలో సుఫారీ ఇచ్చి భావనను కిడ్నాప్‌ చేయించారు. కిడ్నాప్‌ అయిన భావన వ్యవహారంపై కేరళ సీఎం కూడా స్పందించాడు. ఈ వ్యవహారంలో భావనకు మద్దతుగా దేశ వ్యాప్తంగా మహిళలు మరియు పలు సంఘాలు నిలిచారు. భావన విషయంలో రచ్చ జరుగుతున్న సమయంలోనే ఆమె నవీన్‌ అనే నిర్మాతను వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకే భావనతో నవీన్‌కు వివాహ నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థం అయితే అయ్యింది కాని పెళ్లి మాత్రం అయ్యేలా లేదని మయాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 27న భావన, నవీన్‌ల వివాహం జరగాల్సి ఉంది. కాని కొన్ని పెళ్లికి ఏర్పాట్లు ఏమీ జరగడం లేదు. అదే విషయాన్ని భావనను తాజాగా మీడియా వారు ప్రశ్నించగా పెళ్లికి తొందరేం లేదు అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె మాటల్లో కాస్త వేదన కనిపించిందని వారు అంటున్నారు. అప్పటి నుండి కూడా భావన పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్‌ వ్యవహారంకు జరగడానికి కొన్నాళ్ల ముందు భావనకు దిలీప్‌తో అక్రమ సంబంధం ఉందని, ఆ కారణంగానే పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది అంటూ మలయాళ మీడియాలో పుకార్లు గుప్పుమంటున్నాయి. మొత్తానికి భావన హడావుడి ఎంగేజ్‌మెంట్‌ పెళ్లికి దారి తీయలేదు.