సైరా మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?

Syeraa Narasimha Reddy Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఆగస్టులో చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అప్పటి నుండి కూడా రెగ్యులర్‌ షూటింగ్‌ అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చాయి. ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని చిరంజీవి లుక్‌ ఫైనల్‌ కాకపోవడంతో చిత్ర షూటింగ్‌ను వాయిదా వేస్తున్నారు. చిరంజీవి లుక్‌ కోసం చిత్రాన్ని ఆలస్యం చేస్తుండటంతో ఇప్పటికే డేట్లు ఇచ్చిన ఇతర స్టార్స్‌ వారి డేట్లను క్యాన్సిల్‌ చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా మెగా వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం జిమ్‌లో కష్ట పడుతున్నాడని, దర్శకుడు సురేందర్‌ రెడ్డి అనుకుంటున్న ఫిజిక్‌ వచ్చిన తర్వాత అప్పుడు షూటింగ్‌కు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కనుక ఈ చిత్రం కోసం మెగా స్టార్‌ చాలా వర్కౌట్‌ చేస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రామ్‌ చరణ్‌ సిద్దంగా ఉన్నాడు. నయనతార హీరోయిన్‌గా నటించబోతున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి ఇంకా పలువురు స్టార్స్‌ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్‌ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం వచ్చే సంవత్సరంలో విడుదల అవ్వడం కష్టమే అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.